రేణూ దేశాయ్ పెళ్లి.. వివాహ వేదిక ఎక్కడంటే..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 12:17
renu-desai-wedding-plan

తెలుగు చిత్రపరిశ్రమలో ఇలాంటి ప్రేమికులు లేరు, మళ్లీ రారు అనిపించుకున్న జంట పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్. కానీ విధిరాత మరోలా ఉంటే ఎంత గొప్ప ప్రేమికులైతే మాత్రం ఏంచేయగలరు.. ఒక దశలో సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకుని, కొన్నాళ్లకే అందరికీ షాకిస్తూ విడిపోయారు పవన్, రేణూ దేశాయ్. అయితే రేణూ మళ్లీ పెళ్లి చేసుకుంటోందన్న వార్తలు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితమే తన పిల్లలు అకీరా, ఆద్య సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న రేణూ త్వరలోనే మరో వ్యక్తితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైంది. తాజాగా రేణూ దేశాయ్ వెడ్డింగ్‌కి సంబంధించిన ప్లాన్ బయటకు వచ్చింది. రేణూ దేశాయ్ పెళ్లి డిసెంబర్ నెలలో కోయంబత్తూర్ లోని ‘ఇషా’ సెంటర్ కు సంబంధించిన ‘లింగ భైరవీ’ ఆలయంలో జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని రేణు భావిస్తుందట. అంతేకాదు తమ పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోని ఒక అనాధాశ్రమంలో అన్నదానం చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

English Title
renu-desai-wedding-plan

MORE FROM AUTHOR

RELATED ARTICLES