ఆడ పిల్లలుగా పుట్టడమే పాపమా..: రేణూ దేశాయ్

Submitted by arun on Tue, 04/17/2018 - 11:24
Renu Desai

దేశాన్ని కుదిపేస్తున్న అత్యాచార ఘటనలపై తాజాగా రేణు దేశాయ్ స్పందించారు. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 ‘అసిఫా, నిర్భయ, ఉన్నావో యువతి... వీళ్ళందరూ వివిధ వయసులకు చెందిన వారు. కులాల రీత్యా గాని ప్రాంతాల రీత్యా గాని వీరికి ఎటువంటి సంబంధం లేదు, కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధితులంతా (వీరంతా) అడపిలల్లే. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలను చేపట్టాలని ప్రముఖ లాయర్లను, ఓ ప్రఖ్యాత సామాజిక సేవా కార్యకర్తను, ఒక పోలీసు ఉన్నతాధికారిని కోరగా ..‘ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పటిదాకా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ర్యాలీలు నిర్వహించినా ఎటువంటి ఉపయోగం ఉండదని’ తేల్చి చెప్పారు.

ఆడపిల్లలు/ పసిపిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలు నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం ...ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సోషల్ మీడియాలో, అనేక చర్చా వేదికల్లో, రోడ్లపై ర్యాలీల రూపంలో మన నిరసనను తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు అగట్లేదు, ఈ చర్యలకు పాల్పడే రాక్షసులలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ హృదయ విదారక ఘటనలకు చరమగీతం పాడచ్చు. అప్పటివరకు మన ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది .. ఎందుకంటే కన్న తండ్రే తన కూతుళ్లను రేప్ చేసిన చరిత్ర మనకుంది... అందుకే మన ఆడపిల్లలకు తగిన రక్షణ కలిగిస్తూ మనం భద్రంగా కాపాడాల్సిన అవసరం మనకు ఉంది!’ అని రేణూ దేశాయ్ అన్నారు. 

English Title
renu desai tweet on gang rape issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES