పవన్‌కో రూల్‌ నాకో రూలా?: రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 09:45
rp

ఎవరు ఏది మాట్లాడమంటే..అది మాట్లాడటానికి తాను కీలుబొమ్మను కాదంటోంది రేణు దేశాయ్. పవన్ పై విమర్శలొస్తే తానెందుకు స్పందించాలంటూ..మరోసారి ఫ్యాన్స్ దుమ్ము దులిపింది రేణూ. తనను ప్రశాంతంగా బ్రతకనివ్వరా అంటూ..అభిమానులను ఎడాపెడా వాయించేసింది.
 
పవన్ కల్యాణ్ కో రూల్ నాకో రూలా అంటూ రేణు దేశాయ్ మరోసారి అభిమానులపై ఫైర్ అయ్యింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పవన్‌ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కి రేణూ దేశాయ్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా పవన్ అభిమానులు దానిపై స్పందించమని సోషల్ మీడియాలో రేణూని వేధిస్తున్నారట.

రీసెంట్ గా సోషల్ మీడియాలో వేధింపులపై రేణూ తన ఫేస్ బుక్ ద్వారా ఆవేదనను తెలియజేసింది. గతంలో పవన్ అభిమానుల వేధింపులు భరించలేకే ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసినట్లు రేణూ తెలిపింది. ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ని కూడా ప్రశాంతంగా వాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి సంబంధం లేని విషయాలపై కూడా స్పందించమంటూ వేధిస్తున్నారంటూ కామెంట్ చేసింది.

ఏ తప్పు చేయకపోయినా ఐదేళ్ల నుంచి తనని నిందిస్తున్నారని ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు ఏమైనా మాట్లాడితే పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నట్టు నిందిస్తున్నారని రేణూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ గురించి ఎవరో వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే దాని గురించి స్పందించమంటూ కొంతమంది అభిమానులు వేడుకుంటున్నారట. మరికొంతమందైతే బెదిరిస్తున్నారట. ఆ మెసేజ్ లతో తన ఇన్స్ స్టా గ్రామ్ ఇన్ బాక్స్ మొత్తం నిండిపోయిందని రేణూ తన పోస్ట్ లో తెలియజేసింది.

ఐదేళ్ల నుంచి తన ఆత్మాభిమానాన్ని లెక్కచేయని వారు ఇప్పుడు పవన్ పై నిందలొస్తుంటే మాత్రం తెగ బాధపడిపోతున్నారని అభిమానులకి చురకంటించింది రేణూ. పవన్‌కో రూల్ నాకో రూలా అంటూ ప్రశ్నించింది. పవన్ కల్యాణ్ ప్రతిష్టకి భంగం కలిగితే దాన్ని నేను సరిచేయాలా అని ప్రశ్నిచింది. చివరిగా పవన్ కళ్యాణ్ కి తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడనని తనని ఏ రాజకీయ పార్టీ ఇన్ ఫ్లూయెన్స్ చేయలేదని రేణూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైనా అనవసరమైన విషయాల్లో తనని ఇన్వాల్వ్ చేయొద్దని కోరింది. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కి రేణూ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

English Title
Renu Desai Slams Pawan Kalyan Fans

MORE FROM AUTHOR

RELATED ARTICLES