కాబోయో భర్తతో రేణు దేశాయ్.. అకీరా తీసిన ఫోటో..

Submitted by arun on Sat, 07/14/2018 - 16:31
Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడాకులు పొంది ఏడేళ్లు గడిచిపోతోంది. ఇన్నేళ్ళపాటు ఆమె పుణేలో తన పిల్లలతో గడిపింది. ఇటీవలే తాను రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ నిర్ణయించుకోవడం, ఎంగేజ్ మెంట్ చకచకా జరిగిపోయాయి. త్వరలో వివాహం జరగబోతోంది. కానీ ఇంత వరకు వరుడు ఎవరనే సంగతి బయట ప్రపంచానికి తెలియదు. తనకు కాబోయే భర్త వివరాలని రేణు ఇంకా గోప్యంగానే ఉంచుతోంది. సోషల్ మీడియలో ఫొటోలు పెడుతున్నా... కాబోయే భర్త ముఖం మాత్రం స్పష్టంగా కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా కాబోయే భర్త, పిల్లలతో కలసి ఆమె అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. వివాహానికి ముందు వీరంతా ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మరో ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె ముఖం క్లియర్ గా ఉండగా... ఆమె కాబోయే భర్త మాత్రం అటువైపు తిరిగి ఉన్నారు. అదికూడా ఆయన భుజం వరకే కనిపిస్తోంది. ఈ ఫొటోను అకీరా తీసినట్టు ఆమె తెలిపారు.

English Title
Renu Desai raises curiosity on social media with a peek-a-boo of her fiance

MORE FROM AUTHOR

RELATED ARTICLES