ఇకపై ఆన్‌లైన్‌ లో వస్తువు కొంటున్నారా..? అయితే ఆఫర్లు ఉండవు..

Submitted by nanireddy on Thu, 08/02/2018 - 09:36
remove-term-no-online-shoping-offers-in-couple-of-days-no-online-shoping-offers-in-couple-of-day

మొబైల్ కొనాలంటే ఆన్‌లైన్‌.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఆఖరుకు ఆహరం కావాలన్నా.. ఆన్‌లైన్‌.. వస్తువు ఏదైనా.. కొనుగోలు చేసేది మాత్రం ఎక్కువగా ఆన్‌లైన్‌ లోనే. ఈ కామర్స్  సంస్థలు ఎంతెంత ఆఫర్లు ఇస్తున్నాయో వెతికి మరీ వస్తువు కొనేస్తారు.. ఇకపై ఆన్‌లైన్‌ మార్కెట్ లో ఆఫర్ల ఉండవు. ధరలు తగ్గించి విక్రయించడంపై నియంత్రణ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఇ-కామర్స్‌ రంగ విధాన ముసాయిదాలో ప్రతిపాదించారు. త్వరలోనే ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఈ బే,స్నాప్ డీల్, పేటీఎం లాంటి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలతో పాటు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహార సరఫరా వెబ్‌సైట్‌లను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తున్నారు. 

వాస్తవంగా  బీ2సీ ఇ-కామర్స్‌ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(FDI) పరిమితి 49 శాతంగా ఉంది. ఇక బీ2బీ ఇ-కామర్స్‌ వ్యాపరంలో ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అనుమతి ఉంది. అయితే ఈ నిబంధనల వల్ల ప్రస్తుతం దిగ్గజ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలన్నీ కూడా బీ2బీ కిందకు వస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫాంపై విక్రయదార్లు వస్తువులును అమ్ముకునేందుకు వీలు కల్పించి అందుకు ప్రతిగా ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు కమీషన్‌ను పొందుతున్నాయి. పైగా వస్తునిల్వ కోసం కొన్ని అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నాను . అంతేకాకుండా కొన్ని సమయాల్లో థర్డ్‌ పార్టీ విక్రయదార్లుగా మారుతున్నాయి(క్వికర్). తద్వారా ఇచ్చిన పరిమితుల్లో కాకుండా కొన్ని లొసుగులను వాడుకుంటు.. ఎడా పెడా ఆఫర్లు ప్రకటించి విపరీతమైన కమిషన్లు పొందుతున్నాయి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు..  దీంతో ప్రభత్వానికి  రావలసిన రాబడికి గండి పడుతోంది. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని నిపుణుల కమిటీ ముసాయిదాలో ప్రతిపాదించింది. దాంతో ముసాయిదా కార్యరూపం దాలిస్తే ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు ఇచ్చే ఆఫర్లకు గండిపడనుంది.
 

English Title
remove-term-no-online-shoping-offers-in-couple-of-days-no-online-shoping-offers-in-couple-of-day

MORE FROM AUTHOR

RELATED ARTICLES