రెజీనాకు డ్రగ్స్ కు లింకేంటి?

Submitted by arun on Sat, 01/06/2018 - 12:13
Regina Cassandra

నాని నిర్మాత‌గా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో  అ అనే చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసింది. ఈ చిత్రం మేకింగ్ నుంచి టీజ‌ర్ రిలీజ్ వ‌రుకు విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. ఎవ‌రి పాత్ర ఏంటో అర్ధ‌కాకుండానే నిర్మాత నాని టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం విశేషం. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్రా  వెస్ట్రన్ ఔట్ ఫిట్స్.. స్టైలింగ్ తో ఆక‌ట్టుకుంటుంది.  ఇతర క్యారెక్టర్స్ తో పోల్చితే రెజీనా గెటప్ డిఫరెంట్ గా కనిపించ‌డంతో ఈమె డ్ర‌గ్ ఎడిక్ట్ గా యాక్ట్ చేస్తుందేమోన‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెజీనా గెట‌ప్ చూస్తే హాలీవుడ్ లో ఆస్కార్ కు నామినేట్ అయిన యాక్ట్రెస్ రూనీ మురా..లిజ‌బెత్ స‌లెండ‌ర్ పాత్ర‌లో  'ది గాళ్ విత్ ది డ్రాగన్ టాటూ' మూవీలో యాక్ట్ చేసింది. అందులో రూనీ డ్ర‌గ్ ఎడిక్టర్. నానీ నిర్మాత గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆ సినిమాలో రూనీ పోలిక‌లతో ఉన్న రెజీనా డ్రగ్స్ ఎడిక్ట్ గా క‌నిపిస్తుందేమోన‌ని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. హాలీవుడ్ లో డ్ర‌గ్స్ ఎడిక్ట్ పాత్ర‌లో స‌హ‌జమే కానీ తెలుగులో డ్ర‌గ్స్ ఎడిక్ట్ గా రెజీ చేయ‌డం అభినందించ ద‌గ్గ విష‌య‌మేనంటున్నారు ఆమె అభిమానులు.  
 

English Title
Is Regina Cassandra A Drug Addict??

MORE FROM AUTHOR

RELATED ARTICLES