వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

Submitted by arun on Fri, 09/14/2018 - 14:49
recording dance

వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. విజయవాడ శివారు నున్న సమీపంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొందరు యువకులు మహిళలను తీసుకొచ్చి గురువారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్వహకులతో పాటు నృత్యాలు చేస్తున్న మహిళలను అరెస్ట చేశారు. నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై 290,294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English Title
recording dance vinayaka chavithi celebrations

MORE FROM AUTHOR

RELATED ARTICLES