కారులో బేజారు... జోరుగా అసమ్మతి హోరు

కారులో బేజారు... జోరుగా అసమ్మతి హోరు
x
Highlights

గులాబీ గూటిలో అసమ్మతి ముల్లు గుట్టుగా గుచ్చుకుంటుంది. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా... జిల్లాల్లో అభ్యర్థులకు పోటీగా అసమ్మతులు రంగంలోకి...

గులాబీ గూటిలో అసమ్మతి ముల్లు గుట్టుగా గుచ్చుకుంటుంది. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా... జిల్లాల్లో అభ్యర్థులకు పోటీగా అసమ్మతులు రంగంలోకి దిగుతున్నారు. టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ అసంతృప్తులు అసలు అభ్యర్థుల కంటే ముందుగా ప్రచారంలోకి దూకుతున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులను మారిస్తేనే కానీ పార్టీ గట్టెక్కదంటూ అధిష్ఠానానికి రహస్య లేఖలు రాయడమే కాదు... బాహాటంగా ఢంకా బజాయిస్తున్నారు. మంత్రుల స్థానాలను మార్చేది లేదన్న అధినేత ఆదేశంతో వారు కాస్త కుదుటగానే ఉన్నా... చాలా నియోజకవర్గాల్లో అసమ్మతులు, అసంతృప్తులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి.

టిక్కెట్‌ ఆశించిన నేతలు అవాక్కయ్యారు. ఈసారి ఖాయమనున్న నాయకులు ఖంగుతిన్నారు. 90 మంది ఎమ్మెల్యేల్లో 83 మందిని అభ్యర్థులను అధినేత ప్రకటించడంతో ఒక్కసారిగా అసంతృప్తులు అసమ్మతుల రూపంలో
బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగలు నిప్పులా రాజుకుంటున్నాయి.
ఎన్నడూ లేని విధంగా అధినేత కేసీఆర్‌ ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్‌ ఆశించిన నేతలు కంగుతిన్నారు. పార్టీకి ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో 83 మందికి అభ్యర్థులుగా మళ్లీ అవకాశం ఇచ్చారు. జాబితా ప్రకటించగానే కొందరు అభ్యర్థుల పేర్లు మారతాయనే ప్రచారం మొదలైంది. దీంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అభ్యర్థుల కంటే ముందే ప్రచారంలోకి దిగారు.

మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు స్థానాల్లో ముఖ్యమంత్రి మార్పులేదని ప్రకటించడంతో వారు ధీమాగా ఉన్నారు. అయితే ప్రధానంగా రెబర్స్ బెడద ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, హరీష్‌రావుతో ఆయా జిల్లాలవారీగా ఇన్‌చార్జీ మంత్రులు కూడా బుజ్జగింపులు చేస్తున్నారు. అయినా కొందరు వినడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రధానంగా 30కిపైగా నియోజకవర్గాల్లో గట్టి బలం, బలగం ఉన్న రెబల్స్‌ వారి ప్రచారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. బీ- ఫాం ఇచ్చే నాటికి గుర్తించకపోతారా అన్న భరోసాతో ప్రయత్నం చేస్తున్నారు.. ఒకవేళ అదీ కుదురకుంటే రెబల్స్‌గా అయినా ఎన్నికల బరిలో ఉంటామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories