ప్రమాదానికి 10 కారణాలు

Submitted by arun on Tue, 09/11/2018 - 16:29
Kondagattu Bus Accident

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 51 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడుగడుగునా డ్రైవర్ అ జాగ్రత్త కూడా కనిపిస్తోంది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో...ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డబ్బులకు కక్కుర్తి పడి 88 మందిని ఎక్కించారు. పైగా ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట్ల కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నచోట్ల.. స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ ఎలాంటి గుర్తులూ లేవు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. 
ప్రమాదానికి 10 కారణాలు
1, బస్సులో ఎక్కువ మందిని ఎక్కించడం
2. ఘాట్ రోడ్డులో హెచ్చరిక బోర్డులు లేకపోవడం 
3. స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ గుర్తులు లేకపోవడం  
4. బస్సును వేగంగా నడపటం  
5. స్పీడ్ బ్రేకర్‌ను డ్రైవర్ గమనించకపోవడం
6. ప్రయాణికులు పట్టు తప్పి డ్రైవర్‌పై పడటం
7. డ్రైవర్‌ పట్టు తప్పిన స్టీరింగ్ 
8. బోల్తా కొట్టి పల్టీలు కొట్టిన బస్సు
9. బస్సు అంతగా కండిషన్‌లో లేకపోవడం
10. సర్వీస్ రూట్ కాకపోయినా బస్సును నడపడం

English Title
Reasons Behind RTC Bus Accident In Kondagattu Ghat Road

MORE FROM AUTHOR

RELATED ARTICLES