పవనే విడాకులు కావాలన్నారు : రేణూ

Submitted by arun on Sat, 07/07/2018 - 11:46
renu

రేణు దేశాయ్ కొన్ని నెలల క్రితం తన పెళ్లిని గురించి ప్రస్తావించినప్పటి నుంచి పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో కొందరు పవన్ అభిమానుల నుంచి ఆమె మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫైనల్‌ గా రేణూదేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ తో విడాకులకు సంబంధించిన విషయంపై స్పందించారు. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు.

విడాకులకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. ముందు పవన్‌ కల్యానే విడాకులు కావాలన్నారని,  అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదన్న రేణూ... ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు.

English Title
reason behind pawankalyan and renudesai divorce

MORE FROM AUTHOR

RELATED ARTICLES