త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాల్సిందే...‘ఆ సీన్లను తొలగించకుంటే ‘అరవింద’ను అడ్డుకుంటాం’

Submitted by arun on Mon, 10/15/2018 - 16:12
Aravinda Sametha

అరవింద సమేత సినిమా రాయలసీమ ప్రజలు మనోభావాలు దెబ్బ తీసేవిధంగా ఉందని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడో సీమలోనున్న ఫ్యాక్షనిజం ఇప్పటికీ ఉన్నట్లు ఈ సినిమాలో చిత్రీకరించారని ఆరోపించింది. సీమ ప్రజలకు  డైరెక్టర్ త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక నుంచి దర్శక నిర్మాతలు రాయలసీమ కరవు, పేదరికంపై సినిమాలు తీయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు కోరారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.

English Title
rayalaseema students unions demand director trivikram apology

MORE FROM AUTHOR

RELATED ARTICLES