ర్యాటిల్ స్నేక్, తాబేలు స్నేహం..

Submitted by nanireddy on Sun, 11/11/2018 - 08:10
rattlesnake-hitching-a-ride-on-a-tortoise

సాధారంణగా అడవిలో ఉండే క్రూర మృగాలు ఇతర జంతువులు కనిపిస్తే వేటాడడం చూశాం. కానీ అవే జంతువులు స్నేహంగా ఉండడం అరుదుగా చూస్తుంటాం. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఇక్కడ ఓ భయంకరమైన ర్యాటిల్ స్నేక్ తాబేలు వీపుపై ఎక్కి ప్రయాణం చేస్తోంది. అయితే పాము, తాబేలుకు పెద్దగా శత్రుత్వం లేదు కనుక తాబేలు బ్రతికిపోయింది. అత్యంత నిదానంగా నడిచే సరీసృపాల్లో తాబేలు కూడా ఒకటి.. అలాంటిది దానిమీద పాము ఎక్కి కూర్చుంటే మరింత నిదానంగా నడుస్తుందా తాబేలు. గతేడాది వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు తమదైన వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పాముకు బద్ధకం ఎక్కువ అని కొందరంటుంటే.. మరికొందరు పాపం తాబేలు.. బరువుకు బలైందని కామెంట్లు చేస్తున్నారు.

English Title
rattlesnake-hitching-a-ride-on-a-tortoise

MORE FROM AUTHOR

RELATED ARTICLES