కేరళను కుదిపేస్తున్న ర్యాట్.. ఇప్పటికే 8మంది మృతి

కేరళను కుదిపేస్తున్న ర్యాట్.. ఇప్పటికే 8మంది మృతి
x
Highlights

పదిరోజులపాటు వరదలతో అతలాకుతలమైన కేరళకు మరో కష్టం వచ్చింది. వరదనీరు, జంతువుల కలేబరాలు వీధుల్లోనే ఉండటంతో కలుషితం జరిగి ర్యాట్ ఫీవర్ ప్రబలుతోంది....

పదిరోజులపాటు వరదలతో అతలాకుతలమైన కేరళకు మరో కష్టం వచ్చింది. వరదనీరు, జంతువుల కలేబరాలు వీధుల్లోనే ఉండటంతో కలుషితం జరిగి ర్యాట్ ఫీవర్ ప్రబలుతోంది. మొదట్లో జంతువులకు సోకిన ఈ ఫీవర్ క్రమంగా మనుషులకు పాకుతోంది. ఇప్పటికే దీని ప్రభావంతో 8మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కూడా ఈ ఫీవర్ కారణంగా ఓ మహిళ చనిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దీని ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మెడిసిన్ అందిస్తోంది. కాగా ఆదివారం నాటికి కోజ్హికోడే మెడికల్ కాలేజీలో ర్యాట్ ఫీవర్ కేసులో 40 నమోదయ్యాయి. ఇక దీనిపై కేరళ హెల్త్ మినిస్టర్ శైలజ మాట్లాడుతూ.. ర్యాట్ ఫీవర్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని హాస్పిటల్ ఇందుకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories