కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

Submitted by arun on Sun, 09/02/2018 - 11:51
Rashmi Gautam

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అంతకు మించి’ సినిమాలో తన అందంతో యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది కానీ అది ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రష్మీ కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది. అవకాశం ఇస్తానంటే వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి అవకాశానికి తను క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టననీ, దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. కెరీర్ బాగుంటుందనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది. అవకాశం కోసం ఒకరు, అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు పరస్పరం అంగీకారంతో జరిగేదానికి క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం ఏంటంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. గట్టిగా చెప్పాలంటే... అవకాశం ఇస్తానంటే వెళ్లి బెడ్రూంలో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్ అంటూ గొడవ చేయడం ఏంటని అడిగేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో ఉంటుందని కానీ సినీ ఇండస్ట్రీ కొంచం ఎక్కువగా ఉంటుందని.. తనతో మాత్రం ఏ నిర్మాత తప్పుగా ప్రవర్తించలేదని.. నిర్మాతకి, తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయని చెప్పింది రష్మీ. ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

English Title
rashmi hot comments casting couch

MORE FROM AUTHOR

RELATED ARTICLES