దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!

దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!
x
Highlights

సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుద‌లైన‌ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి...

సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుద‌లైన‌ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్‌ రావడం, రాంచరణ్‌, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్‌ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే వన్‌ మిలియన్‌ మార్క్‌ను అధిగమించింది. ప్రీమియర్‌ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్‌ను అధిగమించింది. సినిమా టాక్‌ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories