అనసూయ న్యూ లుక్ : రంగస్థలం అత్త ఇలా ఉంది

Submitted by arun on Mon, 03/19/2018 - 16:16
anasuya

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వస్తున్న సినిమా 'రంగస్థలం'. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తోంది. అత్తగా అనసూయ చాలా కొత్త క్యారెక్టర్ చేసిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రంగమ్మత్తగా అలరించనున్న అనసూయ స్టిల్ ఒకటి తాజాగా బయటకు వదిలింది చిత్రయూనిట్.

ఓ పల్లెటూరులో మధ్య వయస్సు మహిళ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనసూయ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన.. ఈ బ్యూటీని ఈ పాత్రలో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అచ్చం రంగమ్మ అత్తలాగే ఉందని.. ఆ కట్టు బొట్టు సరిగ్గా సరిపోయాయి అంటున్నారు అభిమానులు. మోకాళ్ల వరకు కట్టే చీర, చేతులకు మట్టి గాజులు, కాళ్లకి పట్టీలతోపాటు పసుపు, రెండు ముక్కు పుడకలు, మెడలో పసుపు తాడు ఇలా అచ్చం పాతకాలం అత్తలాగే ఉందని అంటున్నారు. అనసూయ పాత్రకి నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు రావటం విశేషం.

అనసూయ బ్యాక్
ఫిబ్రవరి 6న మొబైల్ లో తన ఫోటో తీశాడని ఓ బాలుడి ఫోన్ పగలగొట్టిన విషయం తెలిసిందే. అప్పట్నంచి సోషల్ మీడియాకి దూరంగా ఉంది అనసూయ. మళ్లీ ఇప్పుడు రంగస్థలంలోని రంగమ్మ అత్త ఫోటోతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌట్లన్నీ రీఓపెన్ చేసింది అనసూయ.

English Title
rangammattha anasuya first look

MORE FROM AUTHOR

RELATED ARTICLES