ఉచిత సలహా ఇచ్చిన నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన రానా..!  

Submitted by arun on Sat, 08/04/2018 - 12:34
rana

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుపాటి రానా. భళ్లాల దేవుడిగా ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రానా అంటే ప్రస్తుతం ఒక హీరో అని చెప్పే కంటే.. ఒక నటుడు అంటేనే కరెక్ట్ సరిపోతుంది. హీరో పాత్రకంటే సపోర్ట్ క్యారెక్టర్ల చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు. బాహుబలి, రాణి రుద్రమదేవి ఇలా తెలుగు చిత్రాలతో.. పాటు హిందీ, తమిళ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు రానా.

ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ’ఎన్టీయార్‘ చిత్రంలో ఓ కీలక పాత్రను రానా పోషిస్తున్నారు. ఈ పాత్ర మరేమిటో కాదు..యన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఇందుకోసం దానికి సంబంధించి ఇప్పటికే రానా కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను రానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫొటో చూసిన ఓ నెటిజన్.. ‘రానా గారు ఇక నుంచి సైడ్ క్యారెక్టర్లు చేయకండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీనిని గమనించిన రానా ‘యన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ చిన్నపాత్ర చేయడం కూడా చాలా గొప్ప’ అంటూ కౌంటర్ ఇచ్చారు. రానా సమాధానానికి నెటిజనులు దటీజ్ రానా అంటున్నారు.
 

English Title
Rana Daggubati to play AP CM ChandraBabu Naidu in NTR Biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES