తోట టాటా?

తోట టాటా?
x
Highlights

నమ్ముకున్న పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయినా దక్కని పదవి. సీనియర్ అయినా దక్కని గుర్తింపు మరోవైపు జిల్లాలో వివిధ పార్టీల పాదయాత్రల జోరు అందుకే ఆయన...

నమ్ముకున్న పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయినా దక్కని పదవి. సీనియర్ అయినా దక్కని గుర్తింపు మరోవైపు జిల్లాలో వివిధ పార్టీల పాదయాత్రల జోరు అందుకే ఆయన మనసు మారుతోందా? తోట త్రిమూర్తులు దారి ఎటు?

తూర్పు గోదావరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి ముందస్తు రాదని తెలిసినా మరో ఏడాదిలో మొదలయ్యే ఎన్నికల హడావుడి కోసం నేతల ప్రిపరేషన్ మొదలైంది. రామచంద్రాపురం నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు ఇప్పుడు పార్టీ మారతారనే ఊహగానాలు ఊపందుకున్నాయి. టీడీపీ సర్కార్ లో మంత్రిపదవి ఆశించి భంగపడిన తోట ఈసారి పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తోట త్రిమూర్తులుది ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం గుండె ధైర్యం ఎక్కువ ఆయనపై పోటీ చేసి గెలుపొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నా ఆయనను ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి తోట త్రిమూర్తులు సీనియర్ అయి ఉండి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కకపోవడం పట్ల తోట అనుచరుల్ల అసంతృప్తి ఉంది. తోట త్రిమూర్తులుకి మంత్రి పదవి రాకుండా ఓ సీనియర్ టీడీపీ నేతే చక్రం తిప్పుతున్నారన్న వార్తలున్నాయి. ఇలాంటి టైమ్ లో పార్టీ మారితే ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందన్న ఆలోచనలు చేస్తోంది ఆయన అనుచర వర్గం. ఇప్పటికే ఆదిశగా మంతనాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం రామచంద్రాపురం నియోజక వర్గంలో పాదయాత్ర జరిపిన జగన్ తోటను ఒక్క మాట కూడా విమర్శించకుండా వెళ్లడం చూస్తుంటే సంప్రదింపుల మాట నిజమేననిపిస్తోంది. మామూలుగా అయితే జగన్ సీఎం చంద్రబాబునే కాదు లోకల్ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసి దుమ్ముదులుపుతుంటారు.

వైసీపీ కి నమ్మిన బంటులాంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తోట ఘాటైన ప్రత్యర్ధి. అయినా జగన్ తోట త్రిమూర్తులును పల్లెత్తు మాట అనకపోవడం చూస్తుంటే పార్టీలో చేరికకు సంప్రదింపులు షురూ అయినట్లే కనిపిస్తోంది. రెండు సార్లు టీడీపీ నుంచి, ఓ సారి ఇండిపెండెంట్ గా, మరోసారి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలుపొందిన చరిత్ర తోట త్రిమూర్తులుది. ఆయనెక్కడున్నా తన సామాజిక వర్గాన్ని బాగా పట్టించుకుంటారన్న వాదనలున్నాయి. అంతేకాదు ఇతర కులాల వారూ తోటను అభిమానిస్తారు. టీడీపీ కేబినెట్ కూర్పులో తోట పేరు మొదట్లో వినిపించినా ఆ తర్వాత అదికాస్తా చినరాజప్పకు దక్కింది. దాంతో అలిగిన తోటకు చంద్రబాబే సర్ది చెప్పారు. పనిలో పనిగా పాత వివాదాలనూ ప్రస్తావించారు అయితే తోట త్రిమూర్తులు అనుచరులు మాత్రం తమ నేత ఎక్కడెదిగిపోతారో అన్న భయంతోనే ప్రత్యర్ధులు మంత్రి పదవి దక్కకుండా చేశారని అంటున్నారు అందుకే ఇప్పుడు మంత్రి పదవి కోసం పార్టీ అయినా మారాలన్న పట్టుదలతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తూర్పుగోదావరి పర్యటనకు వస్తున్న నేపధ్యంలో తమ నేతకు ఏదో ఓ పార్టీ సీటు గ్యారంటీ అని తోట అభిమానులు, అనుచరులు సంబరంగా చెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories