మరో సంచలనానికి తెరలేపిన వర్మ..

Submitted by arun on Thu, 01/11/2018 - 17:38
rgv

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. పోర్న్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేయాలన్న తన కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. ఓ ప్రముఖ పోర్న్‌ స్టార్‌ తో ప్రత్యేక వీడియో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వర్మ తెలియజేశాడు. ఇప్ప‌టికే వెబ్‌సిరీస్ పేరిట అమ్మాయిల‌ను న‌గ్నంగా చూపించిన వ‌ర్మ.. ఈ సారి ఏకంగా పోర్న్‌స్టార్‌తోనే ఓ వీడియో రూపొందించాడు. స‌న్నీలియోన్ త‌ర్వాత మ‌రో పోర్న్‌స్టార్ మియా మ‌ల్కోవా.. వ‌ర్మ ద్వారా భార‌త తెర‌పై మెర‌వ‌నుంది. `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` పేరిట వ‌ర్మ ఈ వీడియోను రూపొందించాడు. ఈ విష‌యాన్ని వ‌ర్మ‌, మ‌ల్కోవా.. ఇద్ద‌రూ త‌మ త‌మ ట్విట‌ర్ ఖాతాల ద్వారా తెలియ‌జేశారు.

`సన్నీలియోన్‌తో ప‌నిచేసే అవ‌కాశం ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ మీతో ప‌నిచేసే చాన్స్ వ‌చ్చింది. ఆ అనుభ‌వాన్నిమ‌ర‌వ‌లేను. నువ్వో అంద‌మైన పెయింటింగ్‌.. నేనో ఫ్రేమ్ మేక‌ర్‌` అంటూ మ‌ల్కోవాను ఉద్దేశించి వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశాడు. `యూర‌ప్‌లో `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` షూటింగ్‌లో పాల్గొన్నా. స‌న్నీలియోన్ త‌ర్వాత భార‌త తెర‌పై క‌నిపించ‌నున్న పోర్న్‌స్టార్ నేనే` అంటూ మియా ట్వీట్ చేసింది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన కొన్ని న‌గ్న ఫోటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతాలో పొందుప‌రిచింది. ఈ చిత్ర ట్రైలర్‌ ను జనవరి 16న విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించటంతో.. అది ఎంత సెన్సేషన్‌ కాబోతుందోనన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.

English Title
Ram Gopal Varma announces film with Mia Malkova

MORE FROM AUTHOR

RELATED ARTICLES