రంగస్థలం ఫస్ట్ రివ్యూ.. ఆ ముగ్గురి నటన హైలెట్!

Submitted by arun on Thu, 03/29/2018 - 15:46
rangasthalam

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. శుక్రవారం ఈ మూవీ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా బాగుందనేది సెన్సార్ టాక్. కాగా సినిమాలకు ముందుగానే రివ్యూలు ఇచ్చే ఉమర్ సంధూ ‘రంగస్థలం’కు కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చి ఈమూవీ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఈమూవీ పైసా వసూల్ మసాలా సినిమాగా అభివర్ణించాడు రామ్ చరణ్, సమంత, జగపతి బాబు వీరు ముగ్గురు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశాడు. 
 

English Title
ram chrans rangasthalam first review by umair sandhu

MORE FROM AUTHOR

RELATED ARTICLES