మ‌రో రెండు రోజుల్లో 'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్‌

Submitted by kasi on Mon, 09/18/2017 - 14:13

అక్కినేని నాగార్జున న‌టిస్తున్న తొలి హ‌ర‌ర్ కామెడీ చిత్రం 'రాజుగారి గ‌ది2'. స‌మంత ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నాగార్జున పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 29న థ‌మ‌న్ సంగీతంలో విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 20న 'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్నారు. సో.. మ‌రో రెండు రోజుల్లో 'రాజుగారి గ‌ది2' ఎలా ఉండ‌బోతుందో ప్రేక్ష‌కుల‌కు ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌.

English Title
'rajugaari gadi 2' trailer in two days

MORE FROM AUTHOR

RELATED ARTICLES