'రాజుగారి గ‌ది2' రీమేక్ అట‌

రాజుగారి గ‌ది2 రీమేక్ అట‌
x
Highlights

అక్కినేని నాగార్జున మెంట‌లిస్ట్‌గా, స‌మంత ఆత్మ‌గా న‌టిస్తున్న చిత్రం 'రాజుగారి గ‌ది2'. 'రాజుగారి గ‌ది'తో సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న ఓంకార్ ఈ...

అక్కినేని నాగార్జున మెంట‌లిస్ట్‌గా, స‌మంత ఆత్మ‌గా న‌టిస్తున్న చిత్రం 'రాజుగారి గ‌ది2'. 'రాజుగారి గ‌ది'తో సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన 'ప్రేత‌మ్' చిత్రానికి కాపీగా తెర‌కెక్కుతోందంటూ వార్త‌లు వినిపించాయి. ఈ విష‌య‌మై ద‌ర్శ‌కుడు ఓంకార్‌ని సంప్ర‌దిస్తే.. కాపీ కాదు ఇది రీమేక్ అని ఓ ఛాన‌ల్‌కి చెప్పుకొచ్చార‌ట‌. 'ప్రేత‌మ్' ట్రైల‌ర్‌, 'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్ ఇంచుమించుగా ఒకేలా ఉండ‌డంతో రీమేక్ అని క‌న్‌ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories