ఆన్‌లైన్‌లో లీకైన 2.ఓ హెచ్‌డీ ప్రింట్‌

Submitted by nanireddy on Thu, 11/29/2018 - 20:11
rajinikanths-20-falls-prey-online-piracy

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో.. ఎస్‌ శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 2.ఓ అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ మూవీకి తొలిరోజు సౌత్ ఇండియాలోనే భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ ఆనందం మూవీ మేకర్స్ కు ఎంతో సేపు నిలవలేదు. సినిమా పూర్తి హెచ్‌డీ ప్రింట్‌ను పైరసీ వెబ్‌సైట్‌ తమిళ్‌రాకర్స్‌ లీక్‌ చేసింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిగంటలకే హెచ్‌డీ ప్రింట్‌ పూర్తిగా లీక్‌ కావడం నిర్మాతలు, రజనీ అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ తరహా పైరసీ వెబ్‌సైట్ల జాబితాతో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆన్‌లైన్‌ పైరసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని చర్యలు తీసుకున్నా సినిమా లీక్ అవ్వడం, పైగా అది హెచ్‌డీ ప్రింట్ అవ్వడంతో దుమారం రేపుతోంది. అన్ని మూవీ లీక్డ్ సైట్లను బ్లాక్ చేసినా.. తమిళ్‌రాకర్స్‌ను మాత్రం ఎందుకు బ్లాక్‌ చెయ్యలేదని ప్రశ్న తలెత్తుతోంది.

English Title
rajinikanths-20-falls-prey-online-piracy

MORE FROM AUTHOR

RELATED ARTICLES