మహేష్, అల్లు అర్జున్ సినిమాలపై రజినీ ఎఫెక్ట్

Submitted by arun on Tue, 01/02/2018 - 15:03
Rajinikanth’s 2.0

మహేష్ బాబు, అల్లు అర్జున్ కు రజినీకాంత్ చుక్కలు చూపిస్తున్నాడు. వాళ్లను ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేసుకోనివ్వడం లేదు. ఈ హీరోలిద్దరూ ఏ రిలీజ్ డేట్ పై ఖర్చీఫ్ వేస్తే రజినీకాంత్ కూడా అక్కడికే వెళుతున్నాడు. ఇప్పటికే ఓసారి మహేష్, బన్నీ సినిమా రిలీజ్ డేట్లను తారుమారు చేసిన రజినీ, తాజాగా మరోసారి షాక్ ఇచ్చాడు. తన రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవడంతో సూపర్ స్టార్ కు, స్టైలీష్ స్టార్ ను గందరగోళంలో పడేశాడు.

రజినీకాంత్ రోబో 2.ఓ మూవీ మహేష్, బన్నీ ప్రాణాల మీదికి వచ్చింది. రోబో 2.ఓ రిలీజ్ డేట్ పై నెలకొన్న గందరగోళం..ఈ హీరోలిద్దరికీ నిద్రలేకుండా చేస్తోంది. తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనేదానిపై ఓ క్లారిటీ లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఓసారి మహేష్, బన్నీ సినిమాలకు రోబో 2.ఓ మూవీ పోటీకి రావడంతో మహేష్, బన్నీ సైడైపోయారు. పోటీ నుంచి తప్పకుని వేరు వేరుగా రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ రజినీకాంత్ రోబో 2.ఓ మూవీ రిలీజ్ డేట్ ను మార్చడంతో..ఈ హీరోలిద్దరూ గందరగోళంలో పడ్డారు. తమ సినిమాలను ముందు అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలా అనే కన్ ఫ్యూజ్ లోపడ్డారు.

సమ్మర్ సీజన్ ను క్యాచ్ చేసుకునేందుకు అల్లు అర్జున్ నా పేరు సూర్య మూవీని ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. సరిగ్గా మహేష్ బాబు కూడా భరత్ అనే నేను మూవీని అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో మహేష్, బన్నీ సినిమాలు ఢీ కొనేందుకు రెడీ అయ్యాయి. అయితే తర్వాత నిర్మాతలిద్దరూ ఓ కాంప్రమైజ్ కు వచ్చి ఒకరు పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నారు. చర్చలు కూడా మొదలెట్టారు.అ లాంటి టైంలోనే రజినీకాంత్  వీళ్లకు షాక్ ఇచ్చాడు.

మహేష్, బన్నీ అనౌన్స్ చేసిన ఏప్రిల్ 27నే రోబో 2.ఓ మూవీ వచ్చేందుకు రెడీ అయింది. దీంతో రోబో 2.ఓ మూవీపై నా పేరు సూర్య మూవీ నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యాడు. నిర్మాతల మండలికి ఫిర్యాదు చేస్తానన్నాడు. కానీ చేసేది లేక రజినీకాంత్ తో పోటీ ఎందుకని మహేష్ బన్నీ ఇద్దరూ తప్పకున్నారు. మహేష్ భరత్ అను నేను సినిమాను ఏప్రిల్ 13కి జరిపితే..బన్నీ ఏమో మే 11న రావాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఏ అడ్డంకి లేదనుకునేలోపే రజినీకాంత్ మూవీ రిలీజ్ డేట్ పరిణామాలు మారడంతో మహేష్, బన్నీ మరోసారి ఇరకాటంలో పడ్డారు.

రోబో 2.ఓ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తూ ఏప్రిల్ 14న విడుదల చేస్తామని రజినీకాంత్ ప్రకటించడంతో మహేష్ బాబుకు నెత్తిన మళ్లీ పిడుగు పడింది. భరత్ అనే నేను రోబో 2.0 మూవీకి ఒకే రోజు గ్యాప్ ఉండడంతో మహేష్ బాబు సస్పెన్స్ లో పడ్డాడు. ఏప్రిల్ 13 నుంచి మొదట ప్రకటించిన 27కే వెళ్లాలని చూస్తున్నాడు. ఇటు బన్నీ కూడా రోబో 2.ఓ మూవీ ముందుకు వెళ్లడంతో ముందు అనౌన్స్ చేసిన ఏప్రిల్ 27 డేట్ ను పరిశీలిస్తున్నాడట. మొత్తానికి రజినీకాంత్ షాక్ తో మరోసారి మహేష్, బన్నీ తమ రిలీజ్ డేట్లను మార్చుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

English Title
Rajinikanth’s 2.0 faces trouble with Mahesh Babu and Allu Arjun films' producers

MORE FROM AUTHOR

RELATED ARTICLES