రజనీ రాజకీయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పార్టీ పెట్టిన మెగస్టార్ చిరంజీవికి రాజకీయం ఎలాంటి చేదు అనుభవాల్ని మిగిల్చిందో అందరికి తెలిసిన విషయమే. చిరంజీవికి తగిలిన ఎదురు దెబ్బలు రజనీకాంత్ కు తగలకుండా ఉంటాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే తమిళనాట రాజకీయం అంటే కత్తిమీద సామేనని చెప్పుకోవాలి.
జయలలిత మరణానంతరం పొలిటిక్స్ ఊసరివెల్లిలా మారాయో నాయకులు కూడా అలాగే పార్టీలు మార్చి తమ ప్రాభవం కోసం ప్రత్యర్ధి ఎత్తుల్ని చిత్తు చేస్తున్నారు. మరి వాటన్నింటిని ధీటుగా ఎదుర్కొని రజనీకాంత్ నిలబడతారో లేదో చూడాలి. ఇక పార్టీ ప్రారంభంలో రజనీకి సినీ ఇండస్ట్రీ మద్దతు ఉన్నప్పటికి..ఆ మద్దతు కడదాకా ఉంటుందా అని చెప్పడం కష్టమేనని క్రిటిక్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల పరంగా చిరంజీవికి ఎదురైన సవాళ్లు రజనీకి కూడా ఎదురు కావడం తథ్యం. ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లినపుడు చిరంజీవి దాదాపు ఒంటరి అయిపోయాడు. సినీ రంగం నుంచి ఆయనకి మద్దతు తెలిపిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
English Title
Is Rajinikanth Really the Change Tamil Nadu’s Politics Needs?