ఒకే వేదికపై దర్శనమిచ్చిన కమల్,రజనీ

Submitted by arun on Wed, 01/17/2018 - 17:55
Rajinikanth

తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్‌ హాసన్‌లో ఒకే వేదికపైకి వచ్చారు. ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానంటూ కమల్ క్లారిటీ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటలకే లోకనాయకుడు కమల్, దళపతి రజనీకాంత్‌లు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రజనీకాంత్...రాజకీయ ఆరంగేట్రానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని మీడియా...ప్రశ్నకు వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా రాజకీయాల్లో భాగమేనన్నారు. 
 

English Title
Rajinikanth and Kamal Haasan make joint appearance

MORE FROM AUTHOR

RELATED ARTICLES