బుకింగ్స్‌లోనూ ‘2.ఓ’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

Submitted by chandram on Thu, 11/29/2018 - 15:20
rajini

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ హీరోగా నటించిన చిత్రం నవంబర్ 29-11-2018న ప్రపంచవ్యాప్తంగా థియేటల్లో సందడి చేస్తుంది. తాజా ఈ చిత్రం గురించే అప్పుడే రేటింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం 2.0 చిత్రం గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. కాగా 2.0 చిత్రం ఎక్కడ విన్న బ్లాక్ బస్టర్ అనే మాట వినిపిస్తుంది. కాగా ఈ సినిమా కొరకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన మీమ్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు సంచలనలు స్పష్టిస్తుంది. ఒక్క పేటీఎమ్‌ ద్వారానే 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు అట. ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు అమ్ముడుపోవడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని రజినీ  అభిమానులు సంబురాల్లో మునిగితెలుతున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకుర్చిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 

English Title
Rajinikanth and Akshay Kumar's 2.0 witnesses a record breaking advance booking; earns a whopping Rs 120 crore

MORE FROM AUTHOR

RELATED ARTICLES