రాజశేఖరా నీపై మోజు తీరలేదురా!

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా!
x
Highlights

కొన్ని పాటలు అలా నిలిచిపోతాయి ఎప్పటికి...అలాంటి పాటే..ఈ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా పాట. ఇది ఒక సంగీతభరితమైన పాట. ఇది అనార్కలి(1955) చిత్రంలోనిది....

కొన్ని పాటలు అలా నిలిచిపోతాయి ఎప్పటికి...అలాంటి పాటే..ఈ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా పాట. ఇది ఒక సంగీతభరితమైన పాట. ఇది అనార్కలి(1955) చిత్రంలోనిది. దీనిని సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు మరియు జిక్కి కృష్ణవేణి గానం చేయగా; ఆదినారాయణరావు స్వరసంగీతాన్ని గొప్పగా అందించారు. ఇది తెలుగువారి మదిలో ఒక మరుపురాని మధురగీతం. మొఘల్ రాజు అక్బర్ దర్బారులో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆశ్చర్య చకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు. అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాట కోసం ఖవ్వాలి బాణిలో ఉత్తరహిందుస్తానీ తరహా కథక్ నాట్యంతో చిత్రీకరించారు.
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా || మనసు నిలువ నీదురా ||
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ || రాజశేఖరా ||

కానిదాన కాదురా కనులనైన కానరా || కానిదాన కాదురా ||
జాగుసేయనేలరా వేగ రావదేలరా || జాగుసేయ నేలరా ||
వేగరార వేగరార వేగరార.
ఒక్కసారి ఈ పాటని వినండి..మీరే అంటారు గొప్ప పాట అని. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories