నాడు ఆకలి కేకలు... నేడు ఆనంద క్షణాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా చెబుతున్న నిజాలు

నాడు ఆకలి కేకలు... నేడు ఆనంద క్షణాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా చెబుతున్న నిజాలు
x
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న సిరిసిల్ల.. ఇప్పుడు జిల్లా కేంద్రం. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాటు చొప్పదండి...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న సిరిసిల్ల.. ఇప్పుడు జిల్లా కేంద్రం. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలతో కలిపి విస్తీర్ణంలో అతి చిన్న జిల్లాగా ఏర్పడింది సిరిసిల్ల. 5 లక్షల 52 వేల 37 మంది జనాభా ఉన్న ఈ జిల్లాలో 2 లక్షల 72 వేల 615 మంది పురుషులు కాగా, 2 లక్షల 76 వేల 235 మంది మహిళలున్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 4 లక్షల 6వేల 16 మంది ఓటర్లు ఉండగా... పురుషులు లక్షా 97 వేల 483 మంది, 2 లక్షల 8వేల 530 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

కొత్త జిల్లాగా ఏర్పడిన సిరిసిల్లలో మూడు నియోజకవర్గాలు, ఒక రెవెన్యూ డివిజన్,13 మండలాలు, 242 గ్రామ పంజాయితీలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ప్రధానమైన తాగు, సాగునీటి సమస్యలతో పాటు.. ముఖ్యంగా నేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా కూడా మరికొన్ని సమస్యలు అలానే వెంటాడుతున్నాయి. దుబాయి వలసలు, బీడి కార్మికుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జిల్లాలో.

1952లో ఏర్పడిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటికి 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో చెన్నమనేని కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇక్కడ నాలుగుసార్లు సీపీఐ నుంచి చెన్నమనేని రాజేశ్వరరావు... ఆ తరువాత ఓసారి టీడీపీ నుంచి గెలిచి మొత్తం 5 ఎన్నికల్లో చెన్నమనేని ఇక్కడ ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న సిరిసిల్ల ఆ తరువాత టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. 2009 నుంచి ఇక్కడ ప్రతి ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ ప్రతినిధిగా కేటీఆరే మొదటి నుంచి అభ్యర్థిగా కొనసాగుతుతన్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి గెలిచే... రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక్కడ జరిగిన ఎన్నికలో ఎక్కువసార్లు వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నిక అవడం విశేషం.

వాయిస్4: సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 16 వేల 56 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 6 వేల 61 మంది పురుషులు ఉండగా, లక్షా 9వేల 995 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నేత కార్మికుల జీవన విధానం ఇక్కడ తాతల కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఒకప్పుడు సిరిసిల్లను సిరులఖిల్లాగా పిలిచేవారు. అయితే గత కొన్నేళ్ల క్రితం వరకు కూడ ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు కొంతమేర ఉపాధి దొరుకుతుండటంతో ఆత్మహత్యలు, ఆకలికేకలు భారీగానే తగ్గాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత సిరిసిల్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తాగునీటి సమస్యతో పాటు, సాగునీటి సమస్య మాత్రం ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. నేతకార్మికులు ఎక్కువగా ఉండే సిరిసిల్లో.. తమకు నూలుడిపోతో పాటు ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నేతన్నలు డిమాండ్‌ చేస్తున్నారు.

2009లో ఏర్పడిన వేములవాడ నియోజకవర్గం.. గతంలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో భాగం. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఐదు మండలాలతో కలపి వేములవాడ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009 నుంచి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి చెన్నమనేని రమేష్ విజయం సాధించారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరి 2010 ఉపఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికలోనూ ఆయనే గెలిచారు. అయితే జర్మని పౌరసత్వం విషయంలో ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఒకసారి, టీడీపీ రెండుసార్లు టీఆర్ఎస్‌ గెలవగా, రెండు పార్టీలు గెలిచిన ప్రతిసారీ పోటీలో ఉన్నది మాత్రం చెన్నమనేని రమేష్‌బాబే అవడం విశేషం.

వేములవాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా 89వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 91వేల 422 మంది పురుషులు కాగా, 98 వేల 535 మంది మహిళలు ఉన్నారు. ఇక నియోజవర్గంలో ట్రై జెండర్స్ ఓటర్లు కూడా ఉన్నారు. వేములవాడ అంటేనే మొదట గుర్తొచ్చేది రాజరాజేశ్వర స్వామి ఆలయం. తెలంగాణలో అతి పెద్ద శైవక్షేత్రం ఇదే. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా హామీలుగానే నిలిచిపోయాయి. ఇక వేములవాడ నియోజవర్గంలో ముఖ్యమైనది తాగు, సాగునీటి సమస్య. మిడ్ మానేరు నుంచి గోదావరి నీటిని నియోజవర్గానికి తెచ్చి సమస్యలు తీర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే గత నాలుగేళ్లుగా లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న హామీలో ప్రస్తుతానికి 40 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించారు. మరోవైపు తాగునీటి సమస్య ఇంకా తీరలేదు. ఇక మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు కూడా అధికంగా ఉండటంతో పాటు సరైన పరిహారం అందకపోవడం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలు అనకున్న రీతిలో లేకపోవడంతో నిర్వాసితుల అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.. వీటితో పాటు నియోజవర్గంలో గల్ఫ్ వలసలు కూడా తగ్గకపోవడంతో ఈ సారి ఎన్నికల్లో ఇవి ప్రభావం చూపే అవకాశం కనపడుతుంది..

జిల్లాలో సిరిసిల్లతో పోలిస్తే వేములవాడలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిరిసిల్ల, వేములవాడలో బీడి కార్మికుల సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. మెట్ట ప్రాంతంగా ఈ జిల్లాలో సాగు కోసం రైతులు పడే కష్టాలు కూడా అన్నీ ఇన్నీ కావు. నేత కార్మికులు, అసాములు రకరకాల పరిశ్రమలు ఇక్కడ పెడితే భవిష్యత్ బాగుంటుందని కోరకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories