తెలంగాణాలో రైతులకు శుభవార్త..

Submitted by nanireddy on Mon, 05/07/2018 - 07:09
raithu bandhu scheme in telangana state

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు బంధు పధకాన్ని ఈ నెల 10 వ తేదీన ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లా  హుజూరాబాద్‌లో ఈ పథకం ప్రారంభోత్సవానికి వేదిక అవబోతుంది. రైతు బంధు పథకంలో భాగంగా రాష్ట్రంలోని 52 లక్షల 72 వేల 779 మందికి చెక్కులు, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయబోతున్నారు. వీరిలో 64 వేల 805 మంది రైతులు రెండు చెక్కులు అందుకోనున్నారు. సాంకేతిక కారణాలతో 50 వేలకంటే ఎక్కువ పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులకు రెండు చెక్కులను అందించనున్నారు. దీనికోసం ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో రూ.4000 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరో రెండు వేల కోట్లను ఈనెల 10 తేదీ లోపు ఏర్పాటు చెయ్యాలని సీఎం అధికారులకు సూచించారు. 

English Title
raithu bandhu scheme in telangana state

MORE FROM AUTHOR

RELATED ARTICLES