సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్

Submitted by nanireddy on Fri, 10/12/2018 - 07:25
rains-cancelled-as-cyclone-titli-damages-srikakulam-distric

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్‌ తుపానుల కన్నా మితిమీరి పెను విషాదాన్ని మిగిల్చింది. తిత్లీ ప్రభావంతో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో సిఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. తుపాన్ ప్రభావంపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.ఇక రాత్రి పొద్దుపోయాక ప్రధాని మోడి నుంచి చంద్రబాబుకు ఫోన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. తుఫాను తీవ్రత, జరిగిన నష్టం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ప్రధాని ఆరా తీశారు.

English Title
rains-cancelled-as-cyclone-titli-damages-srikakulam-distric

MORE FROM AUTHOR

RELATED ARTICLES