ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై వీడని ఉత్కంఠ

ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై వీడని ఉత్కంఠ
x
Highlights

ఛత్తీస్‌గడ్‌ మఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. శనివారం సుదీర్ఘమంతనాలు జరిపి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారని వార్తాలు...

ఛత్తీస్‌గడ్‌ మఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. శనివారం సుదీర్ఘమంతనాలు జరిపి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారని వార్తాలు వచ్చాయి. కాగా దీనిపై తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జీ పీఎల్ మీడియా ద్వారా స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం ఎవరనేది తెలుపనున్నామని చెప్పారు. ఆదివారం మళ్లోక్కసారి కాంగ్రెస్ నేతలు సమావేశం తరువాత అధికారింగా వెల్లడిస్తామని చెప్పారు. ప్రమాణస్వీకారానికి ఇంకా డిసెంబర్ 17సాయంత్రం వరకు గవర్నర్ అవకాశం ఇచ్చారు కాబట్టి నిమ్మలంగా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాం తీసుకుంటామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కూర్చికోసం కాంగ్రెస్‌ నుంచి నలుగురు పోటీ పడుతున్నా టి.ఎస్‌.సింగ్‌దేవ్‌వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతుందని తెలుస్తోంది. సింగ్‌దేవ్‌తో పాటు, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘెల్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహు సీఎం రేసులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories