రాహుల్‌ టూర్‌పై గాంధీభవన్‌ ఏమంటోంది!!

రాహుల్‌ టూర్‌పై గాంధీభవన్‌ ఏమంటోంది!!
x
Highlights

ప్రజాగర్జన పేరుతో ఎన్నికల శంఖారావ సభలను భారీగా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని మూడుజిల్లాల్లో...

ప్రజాగర్జన పేరుతో ఎన్నికల శంఖారావ సభలను భారీగా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని మూడుజిల్లాల్లో నిర్వహించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో, వరుసగా మూడు సభలు పెట్టి, తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. అన్ని సభలకు ప్రజలు, కార్యర్తలు భారీగా హాజరుకావడంతో ఊపిరపీల్చుకోవడమే కాదు, కొత్త శక్తినిచ్చిందని సంబరపడుతోంది. దీనికి తోడు రాహుల్‌ ప్రసంగంలో వాడివేడి కనిపించడంతో పార్టీ నేతల్లో సైతం, కొత్త జోష్‌ నింపిందనే భావన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మూడు జిల్లాల్లో మూడు వర్గాలను, రాహుల్ సభ, తట్టిలేపిందనే భావన కూడ పార్టలో వినిపిస్తోంది. ఆదిలాబాద్‌లో గిరిజనులను, కామారెడ్డి సభలో రైతులను, హైదరాబాద్‌లో మైనార్టీలను రాహుల్‌ కలిశారని, దీంతో ఆ వర్గం ఓటర్లలో సానుకూల భావన ఏర్పడిందని, కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నారు.

రాహుల్ పర్యటనలతో పిసిసి ప్రధానంగా, గత ఎన్నికల్లో దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. గత ఎన్నికల్లో పార్టీ సీట్లు నష్టపోయిన ప్రాంతాలను ఎంపిక చేసి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేసింది. ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉండడంతో, కేవలం మెజార్టీ సీట్లను కోల్పోయి చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా, సీట్లు రావడంతో అక్కడే కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మూడు జిల్లాలను ఎంపిక చేసి, ఉత్తర తెలంగాణలో మెజార్టీగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలనపై రాహుల్‌తో మాట్లాడించింది గాంధీభవన్. తెలంగాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ పాత్రను పదే పదే చెప్పించారు. తెలంగాణ ఇచ్చి, ప్రజలకు కోసం కాంగ్రెస్ త్యాగం చేసిందనే భావన కలిగేలా, రాహుల్ ప్రసంగం ఉండేలా చూసి, కాంగ్రెస్‌కి సింపతి వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories