తెలుగు కాంగ్రెస్ నేతలకు షాక్...

తెలుగు కాంగ్రెస్ నేతలకు షాక్...
x
Highlights

తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండిచ్చింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలని తెలిసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలుగు వారికి స్థానం కల్పించకుండా...

తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండిచ్చింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలని తెలిసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలుగు వారికి స్థానం కల్పించకుండా మొండి చెయ్యి చూపించింది. సిడబ్ల్యుసి లో చోటు దక్కక పోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు.. ఇంతకీ తెలుగు వారికి ఛాన్స్ దక్కక పోడానికి కారణాలేంటి?

ఎన్నికల ఏడాది కావడం అదీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రక్షాళ న కావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసిసిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఎన్నికలొస్తున్నాయి కాబట్టి cwc లో కీలక పదవులు తమకు దక్కుతాయని చాలా ఎదురు చూశారు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందని దానికోసం cwc లో తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని అనుకున్నారు. తెలంగాణ నేతలైతే మరో అడుగు ముందుకేసి దక్షణాదిలో తెలంగాణలోనే పార్టీ కేడర్ బలంగా ఉంది కాబట్టి తమకు పదవులు దక్కుతాయని తెగ ఆశపడ్డారు సీనియర్లు తమకు పదవి గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు. కాని వీళ్ల ఆశలు అడిఆశలయ్యాయి

సిడబ్యూసీలో రెండు రాష్ట్రాలకు అధిష్టానం మొండి చేయి చూపించింది. తెలంగాణ లో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న నాయకులు చివరకు cwc లో చోటు దక్కక పోవడం తో కార్యకర్తల కు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. గతం లో వెంకటస్వామి, జైపాల్ రెడ్డి లాంటి వారు ఇందులో ఉండగా ఈ సారి జైపాల్ రెడ్డి ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల జైపాల్ రెడ్డి నాలుగు రోజులు ఢిల్లీలో మకాం వేయడంతో cwc లో జైపాల్ స్థానం పదిలమని అందరూ భావించారు. కానీ లిస్టులో పేరు లేకపోవడంతో కంగుతిన్నారు.

ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలకు cwc లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అధిష్టానం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎందుకు మొండి చేయి చూపిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో బలం లేని కేరళకు మూడు స్థానాలు ఎన్నికలు పూర్తయిన కర్నాటకలో రెండు స్థానాలు cwc లో కేటాయించి తెలుగు రాష్ట్రాలను మాత్రంఉద్దేశ పూర్వకంగానే విస్మరించడానికి కారణాలేంటన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది.. తెలంగాణలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తెలంగాణ నేతలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందనుకోవాలా?...మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పై అధిష్టానానికి అందిన ఫిర్యాదుల కారణంగానే ఆయనకు cwc లో స్థానం దక్కలేదనే చర్చ పార్టీలో ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇంచార్జి కుంతియాకు cwc లో స్థానం కల్పించి ఆ లోటును పార్టీ వర్గాలు భర్తీ చేశాయా అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.

పార్టీలో పనిచేయడానికి వయసుకన్నా అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చిన రాహుల్ అదే సమయంలో పార్టీకి పెద్దగా పనికి రారని భావించిన వృద్ధతరం నేతలను సాగనంపారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ భవిష్యత్తు అంతా యువతరానిదే అనే సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతోంది. పార్టీలో మేమే కీలకమని చెప్పుకునే నేతలకు ఇది చెంపపెట్టు లాంటి పరిణామమని చెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories