మోడీకి రాహుల్ గాంధీ ఫ్యూయల్ చాలెంజ్

మోడీకి రాహుల్ గాంధీ ఫ్యూయల్ చాలెంజ్
x
Highlights

ట్విట్టర్‌లో రాహుల్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్లుగా కొనసాగుతోంది. లేటెస్ట్‌గా రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీకి ఫ్యూయల్ చాలెంజ్ విసిరారు. పెట్రోల్...

ట్విట్టర్‌లో రాహుల్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్లుగా కొనసాగుతోంది. లేటెస్ట్‌గా రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీకి ఫ్యూయల్ చాలెంజ్ విసిరారు. పెట్రోల్ రేట్లైనా తగ్గించండి.. లేకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలైనా ఎదుర్కోండి అని ట్వీట్ చేశారు. రాహుల్ ఫ్యూయల్ చాలెంజ్ పుట్టుకొచ్చేందుకు ఓ రీజన్ ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫిట్ నెస్ చాలెంజ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీకి కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్ విసిరాడు. దానిని మోడీ స్వీకరిస్తున్నట్లు.. ట్వీట్ చేశారు. కోహ్లీ చాలెంజ్‌కు ప్రధాని ఓకే చెప్పడంతో.. రాహుల్ తన ఫ్యూయల్ చాలెంజ్‌ స్వీకరించాలని మోడీకి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ ప్యూయల్ చాలెంజ్‌ను మోడీ స్వీకరిస్తారా.? లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను.. మోడీ స్వీకరించడంపై.. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందించారు. విరాట్ కోహ్లీ సవాల్ సరే... మా సవాల్‌ను కూడా మోడీ స్వీకరించగలరా అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. కోహ్లీ సవాల్‌ను స్వీకరించడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్న తేజస్వి.. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు ఉపశమనం, దళితులు.. మైనారిటీలపై హింసను రూపుమాపేలా హామీ లాంటి సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నాం. ఈ ఛాలెంజ్‌ను కూడా మీరు స్వీకరిస్తారా మోడీ సర్ అని తేజస్వి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. చమురు ధరలు వరుసగా 11వ రోజు పెరిగాయి. అయినా ప్రధాని మౌనంగానే ఉన్నారన్నారు. కేంద్రమంత్రులేమో చమురు ధరలు తగ్గిస్తే సంక్షేమ పథకాలు చేపట్టలేమంటూ హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లుగా ఎక్సైజ్‌ రూపంలో దోచుకున్న 10 లక్షల కోట్లను ఇంధన ధరలు తగ్గించేందుకు ఉపయోగిస్తారా? ఈ దేశ ఛాలెంజ్‌ను మోడీ స్వీకరిస్తారా? అంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ దేశ ప్రజలకు ట్విటర్‌లో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరారు. రాథోడ్‌ చాలెంజ్‌ను స్వీకరించిన కోహ్లీ... జిమ్‌లో తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రధాని మోడీకి, క్రికెటర్ ధోనీకి, అనుష్క శర్మను కోరాడు. కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించిన మోడీ... తాను కూడా త్వరలోనే ఓ ఫిట్‌నెస్ వీడియో పోస్టు చేస్తానని ట్వీట్ చేశారు. దీంతో.. ఈ ఫిట్ నెస్ చాలెంజ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories