రాహుల్ స‌ర్వేలో జ‌గ‌నే సీఎం

రాహుల్ స‌ర్వేలో జ‌గ‌నే సీఎం
x
Highlights

వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కసరత్తు ప్రారంభించాడు రాహుల్ గాంధీ. ఇందు లో భాగంగా నేషన్ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రాహుల్ ప్రత్యేక సర్వేలు...

వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కసరత్తు ప్రారంభించాడు రాహుల్ గాంధీ. ఇందు లో భాగంగా నేషన్ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రాహుల్ ప్రత్యేక సర్వేలు చేయించుకుంటున్నట్టుగా సమాచారం. మోడీ పాలనపై, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ప్రజల అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నాడట కాంగ్రెస్ అధ్యక్షుడు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారం చేజారిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు.. రాహుల్ అటు రాష్ట్రాల్లోని పార్టీల విషయంలో, బీజేపీ పరిస్థితిపై సర్వేలు చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ఏపీ రాజకీయం విషయంలో కూడా రాహుల్ సర్వేను చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిందని ఈ సర్వే.

ఈ సర్వే వచ్చే ఎన్నికల్లో జగన్దే అధికారం అని తేల్చేసింది. ఏపీలో జగన్ సీఎం కావడం ఖాయమేనని చెప్పడంతో పాటుగా ఏపీలోని 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయాన్ని కూడా ఈ సర్వే చాలా విస్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మొత్తంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయని - అదే సమయంలో టీడీపీ 55 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆ సర్వే చెప్పింది. ఈ సర్వేలో ఆయా జిల్లాలకు సంబందించిన అసెంబ్లీ స్థానాలు - వాటిలో ఎన్నెన్ని స్థానాలు ఏఏ పార్టీలకు వెళతాయన్న విషయంపై నిజంగానే రాహుల్ సర్వే చాలా పక్కాగానే జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. గడచిన ఎన్నికల్లో వైసీపీకి కర్నూలు - కడప జిల్లాలు కంచుకోటలుగా మారితే... టీడీపీకి మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెట్టని కోటగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభ కాస్తంత తగ్గినా... టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరిలో మాత్రం వైసీపీ మెజారిటీ సీట్లను దక్కించుకుంటుందట. అదే సమయంలో తూర్పు గోదావరి - కృష్ణా జిల్లాలు కూడా టీడీపీకి మంచి ఫలితాలనిచ్చే జిల్లాలే. ఈ జిల్లాల్లోనూ జగన్ సత్తా చాటనున్నారని రాహుల్ సర్వే తేల్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories