కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్

Submitted by admin on Tue, 12/12/2017 - 15:20

కాంగ్రెస్‌ యువరాజు పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ్. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి రాహుల్ తప్పా ఎవరు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనప్రాయమేనని పార్టీ వర్గాలు వెల్లడించాయ్. రాహుల్‌ గాంధీకి మద్దతుగా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ  సభ్యులు, రాష్ట్ర విభాగాల నుంచి 75కుపైగా నామినేషన్‌ ఫారాలు దాఖలు కానున్నాయ్. సోనియా, మన్మోహన్‌తోపాటు పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండేలు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. 

English Title
rahul-gandhi-has-filed-nomination-post-congress-president

MORE FROM AUTHOR

RELATED ARTICLES