కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ ఏకగ్రీవం

Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 16న ఆయన సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఓ తరం నుంచి మరో తరానికి చేతులు మారనున్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన‌ ఐదో వ్య‌క్తిగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. అత్యధిక కాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న రికార్డు సోనియా గాంధీ పేరిట ఉంది.

రాహుల్ ఎన్నికను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మూలపల్లి రామచంద్రన్ ప్రకటించారు. ఒక అభ్యర్థి పేరు మీదే మొత్తం 9 నామినేషన్లు వచ్చాయి. రాహుల్‌కు పోటీగా ఎవరూ లేరు. దీంతో ఆయననే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం. ఈ నెల 16న ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారికంగా రాహుల్ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపడుతారు అని రామచంద్రన్ తెలిపారు. రాహుల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఏఐసీసీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories