మోదీ ప్రసంగంపై రాహుల్ కౌంటర్..

Submitted by arun on Wed, 02/07/2018 - 15:20
Rahul Gandhi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ చేసిన పాపాలే ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఒక గంటసేపు మాట్లాడారని, ఎన్నికల ప్రచారం చేసినట్లుగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కుంభకోణం జరిగిందని తాము స్పష్టంగా చెప్తున్నామని, ఈ కుంభకోణంలో పాత్రధారులను కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తాను ప్రధాన మంత్రిననే విషయాన్ని ఆయన మర్చిపోతున్నారన్నారు. రైతుల భవిష్యత్తు, ఉపాధి గురించి తాము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రసంగం చేశారాని, తమకు ప్రసంగాలు అవసరం లేదని, యువతకు ఉద్యోగాలు కావాలని రాహుల్ డిమాండ్ చేశారు.

English Title
rahul gandhi counter attack pm modis speech

MORE FROM AUTHOR

RELATED ARTICLES