నాకు తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు : రాహుల్ గాంధీ

నాకు తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు : రాహుల్ గాంధీ
x
Highlights

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న(కర్నూల్) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చేతకాని హామీలతో అధికారంలోకి...

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న(కర్నూల్) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. తనకు అలాంటి తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వంలో ప్రజలకు చాలా మేలు జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు సవసరమైన సంక్షేమ పథకాలు వచ్చాయని అన్నారు. విభజన నిందను తమపై రుద్ది అధికార టీడీపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు…అలాగే రాష్ట్రంలో బాధ్యతలేని ప్రతిపక్షం ఉందని పరోక్షంగా వైసీపీ ని ఉద్దేశించి విమర్శించారు. ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని అన్నారు. అంతకుముందు కర్నూలులో దివంగత నేతలు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయా నేతల కుటుంబాలతో ముచ్చటించారు. ఆ తర్వాత బైరెడ్డి కన్వెన్షన్ హాలులో విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు రాహుల్.

Show Full Article
Print Article
Next Story
More Stories