బుమ్రా అంటే పిచ్చి

Submitted by arun on Thu, 02/08/2018 - 16:52
bumrah Raashi Khanna

భారత్‌ లో క్రికెట్‌, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్‌ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్‌. అయితే లవ్‌ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర‍్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్‌ బూమ్రా అంటే తనకు పిచ్చి ఇష్టమని చెప్పింది.

 ‘భారత క్రికెట్‌ జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా చూస్తాను. ఏ ఒక్క మ్యాచ్‌ కూడా మిస్సవ్వను. ఎందుకో తెలుసా.. నాకు బుమ్రా అంటే చాలా ఇష్టం. నేను అతనికి చాలా పెద్ద ఫ్యాన్‌ని. అతని కోసమే మ్యాచ్‌లు చూస్తాను. ఒక్కోసారి మ్యాచ్‌లు రాత్రి వేళల్లో ఉంటాయి. అయినా, సరే వదలిపెట్టను’ అని నవ్వుతూ చెప్పింది రాశీఖన్నా. గతంలో బుమ్రా బౌలింగ్‌పై రాశీఖన్నా సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌- రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’ ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది.

English Title
Raashi Khanna talk about bumrah

MORE FROM AUTHOR

RELATED ARTICLES