కూటమిలో బీసీ సీట్లపై ఆర్‌ కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం

కూటమిలో బీసీ సీట్లపై ఆర్‌ కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం
x
Highlights

బీసీ సీట్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని మహాకూటమిలో ప్రజాస్వామ్యం లేదని ఉన్నదంతా ధనస్వామ్యం అని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆరోపణలు...

బీసీ సీట్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని మహాకూటమిలో ప్రజాస్వామ్యం లేదని ఉన్నదంతా ధనస్వామ్యం అని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. 65 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో బీసీలకు 13 స్థానాలే కేటాయించడం సమర్థనీయం కాదన్నారు. కులం, ప్రాంతం, డబ్బు చూసే టిక్కెట్లు ఇస్తున్నారన్న కృష్ణయ్య బీసీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దేశంలో 56శాతానికి పైగా ఉన్న బీసీలకు 14శాతం కూడా ప్రాతినిధ్యం లేదని ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ పథకం ప్రకారమే పార్టీలన్నీ బీసీలపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీసీలకు సీట్లు కేటాయించలేదన్నారు. బీసీలకు సీట్ల కేటాయింపు విషయంలో పార్టీలన్నీ పునరాలోచించుకోవాలని సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్త బంద్‌ చేపట్టాలని నిర్ణయించినట్లు కృష్ణయ్య ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories