పూరీలో ఉన్నవి మూడు తాళం చెవులేనా? నాలుగో చెవిని నొక్కేశారా?

Submitted by santosh on Sat, 06/09/2018 - 11:22
puri jagannatha swamy temple

పూరీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారానికి మూడు తాళాలు ఎందుకు ఉన్నాయి. అసలు మూడు తాళాల ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చింది..? ఒక తాళం లేకుండా ఆ ద్వారాలు తెరవడం సాధ్యమేనా..? ఇందులో ఏదైనా కుట్ర ఉందా..? ఇవన్ని విషయాలను ఆలోచిస్తే... ఆసక్తికరమైన విషయాలే కనిపిస్తాయి. ఎందుకంటే పూరీ శ్రీక్షేత్ర ఆలయంపై పెత్తనం పూరీ గజపతి రాజులదే. రాజుల కాలం పోయాక వారి వారసులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం  అధికారమంతా ప్రభుత్వానిదే. సర్కారు ఆధీనంలోని భాండాగారాన్ని 1978లో తెరిచారు. అప్పుడు ఖజానాలో సంపద లెక్కించారు. కానీ ఆ లెక్కల వివరాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అసలు ఏడు గదుల లోపల ఏముంది..ఆ సంపద విలువెంత అన్న విషయంపై ప్రస్తుత పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ దగ్గర కూడా వివరాలు లేవు. 

జగన్నాథ ఆలయ భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని ఒకేసారి వినియోగిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. వీటిలో ఒకటి పూరీరాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ దగ్గర ఉంటుంది. ఇంకొకటి ఆలయ సెక్యూరిటీ దగ్గర పెట్టారు. మూడో తాళం చెవి ఆలయ పాలనాధికారి దగ్గర ఉంటుంది. 1960 వరకు ప్రధాన గది తాళం చెవి ఒకటి రాజు దగ్గరే ఉండేది. ఆ తర్వాత శ్రీక్షేత్ర పాలనా బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వం స్వీకరించాక ఆ తాళం చెవిని నాటి పాలనాధికారికి అప్పగించారు. ప్రస్తుతం తాళం చెవి మాయమవ్వడంతో కొందరు పూరీరాజుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తన దగ్గర భాండాగారం మొదట గదికి సంబంధించి ఒక తాళం చెవి మాత్రమే ఉందని తెలిపారు. 1960 నుంచి ప్రధాన ద్వారం తాళం చెవి బాధ్యత శ్రీక్షేత్ర పాలనాధికారి, కలెక్టర్‌కే ప్రభుత్వం పరిమితం చేసిందని గుర్తు చేశారు.  

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నాల ఖజానా తాళం చెవులు పోయాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ట్రెజరీ తాళం చెవులు అనుమానాస్పద రీతిలో మాయమైన సంగతి తెలుసుకున్న భక్తులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాళం చెవి పోయినా అందులోని సంపద మాత్రం భద్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ జగన్నాథుని భూముల తరహాలో భాండాగారంలోని ఆభరణాలు పరుల చేతుల్లోకి వెళ్లలేదన్న గ్యారంటీ ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాళం చెవి వ్యవహారంలో దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..దానికి మూడు నెలల గడువిచ్చింది. ఈ వ్యవధిలో దర్యాప్తు సాధ్యమవుతుందా లేదా అన్నదే అసలు చర్చ. 

English Title
puri jagannatha swamy temple

MORE FROM AUTHOR

RELATED ARTICLES