మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం

మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
x
Highlights

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-42 రాకెట్ ద్వారా ఇవాళ(ఆదివారం) రాత్రి ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అన్ని...

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-42 రాకెట్ ద్వారా ఇవాళ(ఆదివారం) రాత్రి ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. PSLV C-42 రాకెట్ ద్వారా బ్రిటన్ కు చెందిన నోవా S.A.R-S, S.S.T.L- S1 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన శాటిలైట్ అమరిక పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ కూడా కొనసాగుతోంది. కాగా PSLV రాకెట్ల ద్వారా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపుతోంది. ఇప్పటి వరకు ఇస్రో 43 PSLV రాకెట్లను నిర్ణీత కక్షలోకి పంపించగా అందులో 41 రాకెట్లు దిగ్విజయంగా కక్షలోకి చేరుకున్నాయి. కేవలం రెండు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. 1993, సెప్టెంబర్ 20వ తేదీన PSLV రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. 1994, అక్టోబర్ నెల నుంచి PSLV విజయపరంపర మొదలయింది. అప్పటి నుంచి వరుస ప్రయోగాలతో ఇస్రో తన సత్తా నిరూపించుకుంటూ వస్తోంది. పూర్తి స్వదేశీ ఉపగ్రహాలతో పాటు ఇప్పటి వరకు 28 దేశాలకు చెందిన 237 ఉపగ్రహాలు షార్ నుంచి నింగిలోకి వెళ్లాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories