సోనియా గుడ్ బై చెప్పేస్తే రాయబరేలికి లీడర్ ఎవరు?

x
Highlights

సోనియా మొత్తం రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నారా? లేక పార్టీ బాధ్యతలకు గుడ్ బై చెబుతున్నారా? పార్టీ బాధ్యతలకు స్వస్తి పలికితే మరి ఆమె కోసమే సృష్టించిన...

సోనియా మొత్తం రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నారా? లేక పార్టీ బాధ్యతలకు గుడ్ బై చెబుతున్నారా? పార్టీ బాధ్యతలకు స్వస్తి పలికితే మరి ఆమె కోసమే సృష్టించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ పదవి పరిస్థితి ఏంటి? సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం మాటేమిటి?

క్రియాశీలక రాజకీయాలనుంచి సోనియా తప్పుకుంటే.. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి కూడా సోనియా గుడ్ బై చెప్పినట్లేనా అన్నది తేలాల్సి ఉంది సిపిపి అంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలను కూడా రాహుల్ కు అప్పగిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి వాస్తవానికి ఈ పదవిని కేవలం సోనియా కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించి మరీ సృష్టించారు సోనియాకు ముందువరకూ లోక్ సభలో పార్టీకి ప్రధానే సభానాయకుడిగా నేతృత్వం వహించేవారు కానీ సోనియా ప్రధాని కానందున పార్టీ అధ్యక్షురాలు అయినందున ఆమె హోదాను కాపాడటానికి పార్టీ రాజ్యాంగంలో ఈ వెసులు బాటు చేశారు దాని ప్రకారం ఆమె సిపిపి ఛైర్ పర్సన్ పార్లమెంటు ఉభయ సభల పార్టీ నేతలూ సిపిపి ఛైర్ పర్సన్ కు జవాబుదారులుగా ఉండాలి అప్పట్లో లోక్ సభ నేతగా కేబినెట్ మంత్రి ప్రణబ్ ఉండగా, రాజ్యసభకు మన్మోహన్ పార్టీ నాయకునిగా నేతృత్వం వహించేవారు. వీరిద్దరూ పార్టీ పరమైన వ్యూహాల విషయంలో సోనియాకు లోబడి పనిచేసేవారు. ఇప్పుడిక సోనియా ప్రకటనతో ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

నెహ్రూ, గాంధీ కుటుంబాలకు కంచుకోట అయిన రాయబరేలి నియోజక వర్గానికి ఆమె నేతృత్వం వహిస్తున్నారు అయిదు దశాబ్దాలుగా రాయబరేలి, అమేథి నెహ్రూ గాంధీ కుటుంబీకుల అధీనంలోనే ఉన్నాయి ఇప్పుడు సోనియా క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తే ఆమె కుమార్తె ప్రియాంక ఆ నియోజక వర్గాలకు నేతృత్వం వహిస్తారేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories