ఆ ఒక్క విషయం నా వ్యక్తిగతం..: మీడియా కౌంటర్ ఇచ్చిన ప్రియాంక

ఆ ఒక్క విషయం నా వ్యక్తిగతం..: మీడియా కౌంటర్ ఇచ్చిన ప్రియాంక
x
Highlights

ఆ ఒక్క విషయం తన వ్యక్తిగతమని మిగిలిన తన జీవితమంతా తెరిచిన పుస్తకమే అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. నటిగా ప్రస్తుతం...

ఆ ఒక్క విషయం తన వ్యక్తిగతమని మిగిలిన తన జీవితమంతా తెరిచిన పుస్తకమే అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. నటిగా ప్రస్తుతం ప్రియాంక చేస్తున్న ప్రాజెక్ట్స్ కంటే... ఆమె పెళ్లిపైనే ఎక్కువ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో ఉన్నారు ప్రియాంక. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ తో ప్రియాంక పెళ్లికి సంబంధించి రోజుకొక వార్త విన్పిస్తోంది. ఇప్పటికే నిక్, ప్రియాంక నిశ్చితార్థం జరిగినట్లు అమెరికన్ మీడియా కోడై కూయగా...సెప్టెంబరు 16 నిక్ బర్త్ డే రోజు వీరి వివాహం జరుగనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఎప్పుడూ ప్రియాంక ఖండించలేదు. మొట్టమొదటి సారిగా మీడియా మొత్తం ఈ విషయంపై ఆమెను చుట్టముట్టడంతో ఎట్టకేలకు నోరుమెదిపారు. సోమవారం సింగపూర్ లో జరిగిన నిక్ మ్యూజిక్ కాన్సర్ట్ కు హాజరైన ప్రియాంక అనంతరం భారత్ కు విచ్చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆమె ను మీడియా చుట్టుముట్టింది. నిక్ తో ఉన్న బంధం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో ప్రియాంక ఒకింత అసహనానికి గురయ్యారు. ‘ నా జీవితం లో 90శాతం తెరిచిన పుస్తకం.. కానీ, ఒక్క 10శాతం మాత్రమైన ప్రైవసీగా ఉండాలని కోరుకుంటా.’ అని అన్నారు. అనంతరం ‘తన వ్యక్తిగత జీవితం గురించి ఓ సాధారణ అమ్మాయిలానే నేను ఆలోచిస్తాను. కొన్ని విషయాలు నాకు మాత్రమే సొంతం కావాలని ఆశించే హక్కు నాకు ఉంది.’ అంటూ చెప్పి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories