భారీ ఆఫర్ కొట్టేసిన ప్రియా ప్రకాష్ వారియర్..

Submitted by nanireddy on Wed, 07/11/2018 - 08:26
priya-varrier-signs-rs-1-crore-deal-national-commercial

'ఒరు అదార్‌ లవ్‌' చిత్రంలో ఓ పాటకు కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్‌ అయ్యారు మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. రాత్రికి రాత్రే స్టార్‌ అయిన విషయం అందరిని ఆశ్చర్యపరిచింది. తాజగా ప్రియా ప్రకాష్ ఆ క్రేజ్ ను డబ్బుగా మలుచుకుంటున్నారు.. ఇటీవల ప్రియా ఓ వాణిజ్య ప్రకటన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇందు కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. రూ. కోటి డీల్‌పై ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. అది జాతీయ ప్రకటన అనే వార్తలు వినిపిస్తున్నాయి.

English Title
priya-varrier-signs-rs-1-crore-deal-national-commercial

MORE FROM AUTHOR

RELATED ARTICLES