మళ్లీ కష్టాల్లో ప్రియా ప్రకాష్ వారియర్‌

Submitted by arun on Tue, 04/10/2018 - 16:58
Priya Prakash Varrier

ప్రియా వారియర్‌కు మళ్ళీ కోర్టు కేసుల కష్టాలు మొదలయ్యాయి. ఇస్లాం ప్రకారం కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే అంటూ హైదరాబాద్‌లో మరో పిటిషన్ దాఖలైంది. ప్రియావారియర్ నటించిన పాట మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కొట్టడం దైవ దూషణ చేయడమే అంటూ మరో ఇద్దరు వ్యక్తులు కోర్టు తలుపు తట్టడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది

తొలి సినిమా విడుదలకు ముందే ఎవ్వరూ ఊహించనంత పాపులారిటీ సంపాదించింది మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. తన తొలి చిత్రం ఒరు అదార్ ల‌వ్‌ లో మూవీలో ఆమె హావభావాలకు యువత ఫిదా అయ్యారు. ఒక్క కన్ను గీటతోనే జాతీయస్థాయిలో అభిమానులను కూడా సంపాదించిపెట్టింది. యూ ట్యూబ్ లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.. అయితే ఇంత పాపులర్ అయిన ప్రియా వారియర్‌కు మాత్రం లీగల్ కష్టాలు తప్పట్లేదు..  ఫిబ్రవరిలో ఒరు ఆదార్ లవ్ మూవీలోని సాంగ్ మాణిక్య మలరాయ పూవి ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉదంటూ కేసు నమోదయింది.. ఆ తరువాత సుప్రీంకోర్టు ప్రియాకు ఆ కేసు నుంచి ఊరట కల్పించింది. అయితే మళ్లీ తాజాగా ఇదే సాంగ్ విషయమై ప్రియాపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రియా కన్నుకొట్టడాన్ని తప్పు పడుతూ కేసు వేశారు. 

మాణిక్య మలరాయ పూవి అనే సాంగ్ మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటడం దైవ దూషణ చేయడమే అని ముస్లిం యువకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ యాక్ట్‌ను వారు ప్రస్తావిస్తూ ప్రియా పిటీషన్‌పై తీర్పు ఇవ్వడానికి ముందు తమ పిటీషన్‌ను విచారణకు స్వీకరించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు కోర్టును అభ్యర్థించారు. మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమా.. కోర్టు చిక్కుల కారణంగా జూన్‌కు వాయిదా పడింది.. తాజాగా ఈ వ్యవహారం పై మరో కేసు నమోదు అవడంతో మూవీ రిలీజ్ పై నీలి నీడలు అలముకున్నాయి.. మొత్తానికి ఈ వ్యవహారం దాదాపు ముగిసి పోయింది అనుకుంటున్న సమయంలో తాజా కేసుతో ఏమలుపు తిరుగుతుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

English Title
Priya Prakash Varrier's wink lands her in trouble once again

MORE FROM AUTHOR

RELATED ARTICLES