ప్రియా ప్రకాశ్ వారియర్.. సీపీఎంలో చేరిందా?

Submitted by arun on Mon, 03/05/2018 - 11:45
Priya Prakash Varrier

ఒరు అడర్ లవ్ అనే మలయాళ సినిమా టీజర్ తో యువత మనసు దోచేసిన అందం ప్రియా ప్రకాశ్ వారియర్ ది. ఈ అమ్మాయి గురించే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆమె హావభాబాలు అంతగా ప్రభావం చూపించడంతో.. రాజకీయ నాయకులు కూడా ప్రియా పేరును.. ఫొటోలను తమ అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ప్రియా సొంత రాష్ట్రం కేరళలో ఈ తీరు బాగా కనిపిస్తోంది.

అక్కడి సీపీఎం యూత్ వింగ్ నేతలు.. ఈ మధ్య ఓ పోస్టర్ తయారు చేయించారు. ఒరు అడర్ లవ్ సినిమా పోస్టర్ మాదిరిగానే పార్టీ పోస్టర్ ను ప్రింట్ చేయించి.. దానిపై ప్రియా ప్రకాశ్ ఫొటోను కూడా ముద్రించారు. అలా.. జనాన్ని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. దీంతో.. ఆ పోస్టర్ చూసిన వాళ్లంతా.. అప్పుడే ప్రియా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేసిందా అని చర్చించుకుంటున్నారు.

కానీ.. గతంలోనూ కొందరు కేరళ నేతలు.. కిమ్ జోన్, కారల్ మార్క్స్ ఫొటోలతో ప్రచార చిత్రాలు ముద్రించి.. చర్చలకు తెర తీశారు. ఇప్పుడు కూడా ప్రియా ఫొటోలు వాడుకుంటూ.. ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. అంతే తప్ప.. ప్రియా ప్రకాశ్ వారియర్.. సీపీఎంలో చేరలేదు.. సీపీఐలో చేరలేదు.

English Title
Priya Prakash Varrier is joined in CPI

MORE FROM AUTHOR

RELATED ARTICLES