ముందంజలో భారత్ ప్రధాని..!

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 11:47
Prime Minister of India at the forefront

భారత్‌లో మోదీ అత్యంత పాపులారిటీ గల రాజకీయనాయకుడని అమెరికా సర్వే సంస్థ ఫ్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. భారత్‌లో 2,464 మందితో సర్వే జరిపించామని అన్ని రాష్ట్రాల్లో తమ బృందం పర్యటించిందని సంస్థ తెలిపింది. ఆ సర్వేలో ప్రధాని మోదీకి 88 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారంది. అలాగే రాహుల్ గాంధీకి 58శాతం, సోనియా గాంధీకి 57శాతం, కేజ్రివాల్‌కి 39శాతం ఓట్లు వచ్చాయని తెలిపింది. అందరి కంటే ముందంజలో ప్రధాని మోదీ ఉన్నారంటోంది. అలాగే ఆయన పాలనపై కూడా ప్రజలు విశ్వాసంగా ఉన్నారంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ప్రధాని మోదీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని చెబుతోంది. 

English Title
Prime Minister of India at the forefront

MORE FROM AUTHOR

RELATED ARTICLES